Hyderabad News: రాజాసింగ్‌ బుల్డోజర్‌ వ్యాఖ్యలు.. కేసు నమోదు

గోషామహల్‌ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదైంది. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆదేశాలతో మంగళ్‌హాల్‌ పీఎస్‌లో

Updated : 20 Feb 2022 11:45 IST

హైదరాబాద్‌: గోషామహల్‌ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదైంది. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆదేశాలతో మంగళ్‌హాట్‌ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. యూపీ ఎన్నికల సందర్భంగా రాజాసింగ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు పెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి ఓటర్లను ఉద్దేశించి రాజాసింగ్‌ ఇటీవల వీడియో విడుదల చేశారు. యూపీ ఎన్నికల్లో హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల తర్వాత యోగికి ఓటు వేయని వారిని గుర్తిస్తామని హెచ్చరించారు. భాజపాకు ఓటువేయని వారి ఇళ్లకు బుల్డోజర్లను పంపిస్తామన్నారు. దీనిపై రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేసిన ఈసీ.. 19వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఆయన వద్ద నుంచి సమాధానం రాకపోవడంతో కేసు నమోదు చేయాల్సిందిగా ఈసీ మంగళ్‌హాట్‌ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని