CBI: విచారణకు రండి.. మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్రకు సీబీఐ నోటీసులు

తెరాస నేతలకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌, తెరాస రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు నోటీసులు జారీ చేసి రేపు విచారణకు హాజరు కావాలని కోరింది.

Updated : 30 Nov 2022 13:56 IST

దిల్లీ: తెరాస నేతలకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. దిల్లీలో అరెస్టయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్‌కు సంబంధించిన కేసులో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌, తెరాస ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు నోటీసులు ఇచ్చింది. రేపు దిల్లీలో జరిగే విచారణకు హాజరుకావాలని సూచించారు. అరెస్ట్‌ అయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్‌.. మంత్రి కమలాకర్‌తో టచ్‌లో ఉన్నట్లు సీబీఐ వర్గాలు పేర్కొంటున్నాయి.

తనకు ఉన్న పరిచయాల ద్వారా గ్రానైట్‌ వ్యవహారాలకు సంబంధించిన కేసులో ఉపశమనం వచ్చేలా శ్రీనివాస్‌ ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కరీంనగర్‌లోని మంత్రి ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. శ్రీనివాస్‌తో సంబంధాలు, ఎవరెవరితో మాట్లాడారు తదితర అంశాలపై గంగుల కమలాకర్‌, వద్దిరాజు రవిచంద్ర వాంగ్మూలం నమోదు చేసేందుకే నోటీసులు ఇచ్చినట్లు సీబీఐ వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని