Chandrababu: అనపర్తి సీటుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించిన అనపర్తి అసెంబ్లీ స్థానం మార్పు ఉంటుందంటూ పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

Updated : 04 Apr 2024 20:44 IST

కొవ్వూరు: పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించిన అనపర్తి అసెంబ్లీ స్థానం మార్పు ఉంటుందంటూ పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అనపర్తి సీటు భాజపాకు కేటాయించినా ఇంకా నిర్ణయం కాలేదని కొవ్వూరు ప్రజాగళం సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. రాజమహేంద్రవరం పార్లమెంట్‌ పరిధిలో ఉన్న అనపర్తి స్థానానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని తొలి జాబితాలో తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించింది.

భాజపాతో పొత్తు కుదిరాక ఆ స్థానంలో భాజపా శివకృష్ణంరాజును అభ్యర్థిగా నిలబెట్టింది. అయితే, అనపర్తి స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేస్తే రాజమహేంద్రవరం పార్లమెంట్‌ స్థానంలో భాజపాకు గెలుపు సులభతరం అవుతుందనే వాదన గత కొంతకాలంగా నడుస్తోంది. దీనిపై తెలుగుదేశం, భాజపా పునరాలోచనలో పడి స్థానం మార్పుపై చర్చలు జరుపుతున్నాయి. ఈ తరుణంలో చంద్రబాబు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు