
Chandrababu: ఎస్సీలపై దాడులు చూస్తుంటే ఆందోళన కలుగుతోంది: చంద్రబాబు
కుప్పం: రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు చూస్తుంటే ఆందోళన కలుగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఎస్సీలను చంపేసుకుంటూ పోతే అడిగేవారు లేరనుకున్నారా అని ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన ఇవాళ కుప్పంలో నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడారు.‘‘వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక ఎస్సీ మాస్కు పెట్టుకోలేదని కొట్టి చంపారు. ముఖ్యమంత్రి మాత్రం మాస్కు పెట్టుకోరు. ఎస్సీ, ఎస్టీలను అవమానిస్తే చూస్తూ ఊరుకోము. వారి మనోభావాలు దెబ్బతీస్తే సహించేది లేదు. రాజ్యాంగ హక్కులు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది’’ అని చంద్రబాబు అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.