Cm Jagan: కేసుల ద్వారా అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాల కుట్రలు: సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లో చురుగ్గా రోడ్ల మరమ్మతులు జరుగుతున్నాయని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. నాడు-నేడు ద్వారా చేపట్టే పనుల్లో పురోగతి కనిపిస్తోందని వెల్లడించారు. రాష్ట్ర వ్యా్ప్తంగా

Published : 22 Jun 2022 01:07 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో చురుగ్గా రోడ్ల మరమ్మతులు జరుగుతున్నాయని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. నాడు-నేడు ద్వారా చేపట్టే పనుల్లో పురోగతి కనిపిస్తోందని వెల్లడించారు. రాష్ట్ర వ్యా్ప్తంగా రోడ్ల నిర్మాణం, మరమ్మతు పనులపై సంబంధిత అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. అసంపూర్తిగా ఉన్న రోడ్లు, వంతెనలు, ఆర్‌వోబీలను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తుపాను బాధిత ప్రాంతాల్లోనూ వెంటనే పనులు చేపట్టాలని చెప్పారు. పంచాయతీరాజ్‌ రోడ్ల మరమ్మతులు, రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. జులై 15 నాటికి గుంతలు పూడ్చాలని.. 20న ఫొటో గ్యాలరీలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగనీయకుండా ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని సీఎం జగన్‌ మండిపడ్డారు. కేంద్రం నుంచి సాయం, రుణాలు అందకుండా, కేసుల ద్వారా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్‌ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని