CM Kcr: యూసీసీకి మేం వ్యతిరేకం.. తేల్చి చెప్పిన సీఎం కేసీఆర్‌

ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించారు. యూసీసీ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు కేసీఆర్‌ తేల్చి చెప్పారు.

Updated : 10 Jul 2023 20:25 IST

హైదరాబాద్‌: ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తేల్చి చెప్పారు. యూసీసీ వల్ల అన్ని వర్గాల ప్రజల్లో అయోమయం నెలకొంటుందన్నారు. ప్రత్యేక సంస్కృతి కలిగిఉన్న జాతులు, మతాలకు ఇబ్బందిగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. భాజపా దేశాభివృద్ధిని విస్మరించి విద్వేష రాజకీయం చేస్తోందని విమర్శించారు. భాజపా ఇప్పటికే పలు రకాలుగా ప్రజల మధ్య చిచ్చుపెట్టిందన్నారు. యూసీసీ పేరుతో మరోసారి ప్రజలను విభజించేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు. భారత్‌.. భిన్నత్వంలో ఏకత్వం చాటుతూ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అలా ఆదర్శంగా నిలిచిన భారతీయుల ఐకమత్యాన్ని చీల్చేందుకు కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. యూసీసీపై కేంద్రం నిర్ణయాలను తిరస్కరిస్తున్నట్లు కేసీఆర్ తేల్చి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని