AP News: ఏపీలో 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

ఏపీలో 8 మంది రెబల్‌ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు.

Published : 26 Feb 2024 22:58 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 8 మంది రెబల్‌ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. వైకాపా, తెదేపా పార్టీలు ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై విచారణ చేపట్టి, న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం స్పీకర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై అనర్హత వేటు వేయాలని వైకాపా కోరగా..  మద్దాల గిరి, కరణం బలరామ్‌, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్‌పై తెదేపా పిటిషన్‌ ఇచ్చింది. దీంతో ఇటీవలే విచారణ ముగించిన స్పీకర్‌ వారిపై వేటు వేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు