National Herald Case: ఈడీ నోటీసులు.. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు అధిష్ఠానం పిలుపు

నేషనల్‌ హెరాల్డ్ కేసులో తెలంగాణకు చెందిన పలువురు కాంగ్రెస్‌ నేతలకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది.

Published : 30 Sep 2022 13:23 IST

హైదరాబాద్‌: నేషనల్‌ హెరాల్డ్ కేసులో తెలంగాణకు చెందిన పలువురు కాంగ్రెస్‌ నేతలకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. పార్టీకి, అనుబంధ సంస్థలకు విరాళాలు ఇచ్చిన వారికి నోటీసులు అందజేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి ఆయా నేతలకు పిలుపొచ్చింది. గురువారమే పలువురు నేతలు హస్తినకు చేరుకోగా.. మరికొందరు శుక్రవారం బయల్దేరి వెళ్లారు. కేసు పూర్వాపరాల గురించి కాంగ్రెస్‌ అధిష్ఠానం వారికి వివరించనుంది.  

కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, రాష్ట్ర మాజీ మంత్రులు షబ్బీర్‌ అలీ, సుదర్శన్‌రెడ్డి, గీతారెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌ తదితరులు దిల్లీ వెళ్లినట్లు సమాచారం. ఈ మధ్యాహ్నం ఆడిటర్లతో కాంగ్రెస్‌ నేతలు సమావేశం కానున్నారు. 

ఈ సమావేశంలో ఆడిట్‌ పరంగా, న్యాయపరంగా చర్చించే అవకాశమున్నట్లు నేతలు తెలిపారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఇప్పటికే కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్‌గాంధీలను ఈడీ విచారించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని