Andhra News: స్పీకర్‌ సార్‌.. నా రాజీనామాను ఆమోదించండి: గంటా శ్రీనివాసరావు

ఎమ్మెల్యే పదవికి తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ను

Published : 14 Mar 2022 12:12 IST

విశాఖపట్నం: ఎమ్మెల్యే పదవికి తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ గతేడాది ఫిబ్రవరిలో స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేశానని గుర్తు చేశారు. ఏడాదికి పైగా ఉక్కు కార్మికులు ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలుపుదలకు చర్యలు కూడా తీసుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో తాను చేసిన రాజీనామాను వెంటనే ఆమోదించాలని స్పీకర్‌ను గంటా కోరారు. 

2019 ఎన్నికల్లో తెదేపా తరఫున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు గెలుపొందిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని