మోదీకి రాజ్యాంగ ప్రతి పంపిన కాంగ్రెస్‌

పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ)కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ తాజాగా ప్రధాని మోదీకి రాజ్యాంగ ప్రతిని పంపింది. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా....

Published : 26 Jan 2020 17:13 IST

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ)కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ తాజాగా ప్రధాని మోదీకి రాజ్యాంగ ప్రతిని పంపింది. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పుస్తకాన్ని పంపి.. దేశాన్ని విభజించే ముందు ఓ సారి చదువుకోండి అంటూ ట్వీట్‌ చేసింది. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ వరుస ట్వీట్లు చేసింది. అందులో ఆ పార్టీ నేతలు సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్‌, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా రాజ్యాంగ ప్రవేశిక చదువుతున్న వీడియోలను ఉంచింది. వాటితో పాటు అమెజాన్‌లో కొనుగోలు చేసిన రాజ్యాంగ ప్రతికి సంబంధించి స్క్రీన్‌షాట్‌ను కూడా జోడించింది.

‘ప్రధాని మోదీజి ఈ ప్రతి త్వరలోనే మీకు చేరుతుంది. మీరు దేశాన్ని విభజించాలని యోచించే ముందు దీన్ని ఓ సారి చదవండి. ఇట్లు కాంగ్రెస్‌ పార్టీ’’ అని ట్వీట్‌ చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 ప్రకారం అందరూ సమానేమనన్న భావనను భారతీయ జనతా పార్టీ అర్థం చేసుకోలేకపోతోందని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. పౌరసత్వ సవరణ చట్టం ద్వారా ఆ పార్టీ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. వ్యక్తులపై వివక్ష చూపుతూ రూపొందించే చట్టాలు ఏవైనా రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని