కమల్‌నాథ్‌ సర్కార్‌కు నేడే బలపరీక్ష..!

మధ్యప్రదేశ్‌లో ఎమ్మెల్యేల రాజీనామాలతో రాజకీయ అనిశ్చితి నెలకొంది. కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే, ప్రభుత్వాన్ని

Updated : 21 Dec 2022 16:50 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో బలపరీక్షకు రంగం సిద్ధమైంది.  అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే శుక్రవారం సాయంత్రం 5గంటలలోపు కమల్‌నాథ్‌ బలపరీక్షలో నెగ్గాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా.. కరోనా వైరస్‌ ప్రభావంతో అసెంబ్లీ సమావేశాలను మార్చి 26కు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, బలపరీక్ష కోసం అత్యవసర సమావేశం నిర్వహించాలని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం స్పీకర్‌ను కోరింది. అధికార కాంగ్రెస్‌ నుంచి 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. మరోవైపు తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెంటనే బలపరీక్ష నిర్వహించాలంటూ భాజపా నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గురువారం సర్వోన్నత న్యాయస్థానం కమల్‌నాథ్‌ సర్కారుకు ఈ ఆదేశాలు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని