Andhra News: మా అమ్మకి హార్ట్‌ ప్రాబ్లమ్‌ ఉంది.. ఆమెను ఎక్కడ దాచిపెట్టారు?: యోగేంద్రనాథ్‌

గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.  వైకాపా ఎంపీటీసీ తాడిబోయిన పద్మావతి కనిపించకపోవడంపై

Updated : 05 May 2022 15:38 IST

దుగ్గిరాల: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలానికి చెందిన వైకాపా ఎంపీటీసీ తాడిబోయిన పద్మావతి కనిపించకపోవడంపై ఆమె కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇంటి నుంచి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) బలవంతంగా తీసుకెళ్లారని.. ఎంపీపీ ఎన్నిక జరుగుతున్నా తమ తల్లిని ఎందుకు తీసుకురాలేదని ఆమె కుమారుడు యోగేంద్రనాథ్‌ ప్రశ్నించారు. తమ తల్లి ఎక్కడున్నారో చెప్పాలని ఆయన  డిమాండ్‌ చేశారు. 

తమ తల్లిని ఎమ్మెల్యే కిడ్నాప్‌ చేశారంటూ ఎస్‌ఈసీ, డీజీపీకి పిర్యాదు చేసినా కనీస స్పందన కూడా లేదని యోగేంద్రనాథ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎంపీపీ ఎన్నిక ఎదుర్కొంటామంటున్న ఎమ్మెల్యే ఆర్కే.. ఎందుకు దాచిపెట్టారని ఆయన నిలదీశారు. తమ తల్లి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతోందని.. ఆమె ఆరోగ్యం పట్ల తమకు ఆందోళనగా ఉందన్నారు. ఈ కిడ్నాప్‌పై హైకోర్టును ఆశ్రయిస్తామని.. హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేస్తామని యోగేంద్రనాథ్‌ తెలిపారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని