ప్రత్యేక ఆకర్షణగా బాలకృష్ణ

యువగళం పాదయాత్రలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Updated : 28 Jan 2023 06:16 IST

కుప్పం, న్యూస్‌టుడే: యువగళం పాదయాత్రలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హిందూపురం నుంచి కుప్పానికి చేరుకున్న ఆయనకు దారి పొడవునా అభిమానులు, తెదేపా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. కార్యకర్తల తాకిడి ఎక్కువ కావడంతో ఒకానొక సమయంలో ఆయన ప్రచార రథం ఎక్కి 20 నిమిషాల తర్వాత కిందకు దిగారు. తర్వాత అభిమానులతో సెల్ఫీలు దిగారు. ఏలూరు జిల్లా నుంచి వచ్చిన దుర్గాదేవి అనే అభిమాని జై బాలయ్య అని నినదిస్తుండగా ఆమెను పిలిచి ఫొటో దిగి మాట్లాడారు. చర్చి దగ్గర ప్రార్థనలు చేసే సమయంలో బయట ఉన్న బాలకృష్ణకు తారకరత్నను పీఈఎస్‌ ఆసుపత్రిలో చేర్పించారనే సమాచారం రావడంతో కారులో వేగంగా వెళ్లారు. ఈ సమయంలో ఓ అభిమాని ద్విచక్రవాహనంపై అనుసరిస్తుండగా ఫొటోల కన్నా ప్రాణం ముఖ్యమని హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు