గవర్నర్‌ను కలిశారని వాణిజ్యపన్నుల శాఖ ఉద్యోగుల్ని వేధిస్తారా?

సకాలంలో జీతాలు చెల్లించేలా చట్టం చేయాలని కోరుతూ అప్పటి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసినందుకే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ సహా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులను వైకాపా ప్రభుత్వం వేధిస్తోందని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ధ్వజమెత్తారు.

Published : 04 Jun 2023 05:06 IST

తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సకాలంలో జీతాలు చెల్లించేలా చట్టం చేయాలని కోరుతూ అప్పటి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసినందుకే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ సహా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులను వైకాపా ప్రభుత్వం వేధిస్తోందని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ధ్వజమెత్తారు. ఉద్యోగుల జీపీఎఫ్‌, బీమా సొమ్ము వాడుకోవడం, సకాలంలో జీతాలు, ఆర్థిక ప్రయోజనాలు కల్పించకపోవడంపై ప్రశ్నిస్తే వేధిస్తారా అని శనివారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ‘‘పోలీసులను అడ్డంపెట్టుకొని ఉద్యోగులపై అక్రమ కేసులు పెడుతున్నారు. సలహాదారులకు క్రమం తప్పకుండా జీతభత్యాలు చెల్లిస్తున్న ప్రభుత్వం.. సీపీఎస్‌ రద్దు హామీని అమలు చేయాలని కోరినందుకు ఉపాధ్యాయులపై దాడులు చేయించింది. ప్రతిపక్షంలో ఉండగా ఉద్యోగులకు ఇచ్చిన హామీల మాటేంది? వీటికి సీఎం జగన్‌ సమాధానం చెప్పాలి’’ అని సత్యప్రసాద్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని