అభివృద్ధి జరిగిందనే దశాబ్ది సంబురాలు

ప్రతి గడపకు భారాస ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని, రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందనే దశాబ్ది సంబురాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత స్పష్టంచేశారు.

Published : 09 Jun 2023 04:19 IST

ఎడపల్లి, న్యూస్‌టుడే: ప్రతి గడపకు భారాస ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని, రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందనే దశాబ్ది సంబురాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత స్పష్టంచేశారు. నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లిలో గురువారం నిర్వహించిన ఊరూరా చెరువుల పండగ కార్యక్రమానికి బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘‘బోధన్‌ నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యత. పదేళ్ల క్రితం మంత్రిగా ఉన్న సుదర్శన్‌రెడ్డికి తన సొంతూరు సిరన్‌పల్లి ప్రజలకూ పింఛన్లు ఇప్పించే అవకాశం ఉండేది కాదు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకొంటే చాలు పింఛన్లు మంజూరు అవుతున్నాయి.  రాష్ట్రంలోని 47 వేల చెరువులను బాగు చేయించాం. ఫలితంగా గ్రామాలకు పూర్వ వైభవం వచ్చి 4లక్షల మందికి ఉపాధి దొరుకుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20 వేల చెరువులకు నీరందిస్తున్నాం’’ అని వివరించారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ జడ్పీ ఛైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, వైస్‌ ఛైర్‌పర్సన్‌ రజితాయాదవ్‌, భారాస నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని