వైకాపాను వీడి తెదేపాలో చేరిన వారిపై కేసులా?

వైకాపాను వీడి తెదేపాలో చేరిన వారిపై సీఎం జగన్‌రెడ్డి, ఆ పార్టీ నేతలు కక్షసాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

Published : 02 Jul 2022 05:11 IST

అచ్చెన్నాయుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపాను వీడి తెదేపాలో చేరిన వారిపై సీఎం జగన్‌రెడ్డి, ఆ పార్టీ నేతలు కక్షసాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. పార్టీ మారితే అక్రమంగా కేసులు పెడతారా అని శుక్రవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ‘‘రాజంపేటకు చెందిన వైకాపా రైతు నాయకుడు మద్దిరెడ్డి కొండ్రెడ్డి  ఏప్రిల్‌ 29న తెదేపాలో చేరారు. నాటి నుంచి వైకాపా వాళ్లు ఆయన్ను వేధిస్తున్నారు. చంద్రగిరి, మదనపల్లె స్టేషన్లలో అక్రమ కేసులు బనాయించడమే కాకుండా వైకాపా గూండాలు ఆయన ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఈ అరాచక విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు