తెదేపా సామాజిక మాధ్యమ ప్రతినిధిపై కేసు

తనకు పథకం లబ్ధి చేకూరలేదని చెప్పిన తెదేపా సామాజిక మాధ్యమ ప్రతినిధిపై కేసు నమోదైంది. అనంతపురం జిల్లా రాయదుర్గం 8వ వార్డులో శనివారం ఉదయం ప్రభుత్వ

Published : 03 Jul 2022 05:35 IST

రాయదుర్గం పట్టణం, న్యూస్‌టుడే: తనకు పథకం లబ్ధి చేకూరలేదని చెప్పిన తెదేపా సామాజిక మాధ్యమ ప్రతినిధిపై కేసు నమోదైంది. అనంతపురం జిల్లా రాయదుర్గం 8వ వార్డులో శనివారం ఉదయం ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సమయంలో తెదేపా సామాజిక మాధ్యమ ప్రతినిధి మారుతి ఇంటి వద్దకు వెళ్లి సంక్షేమ పథకాల లబ్ధి వివరాల బుక్‌లెట్‌ ఇవ్వగా, తనకు అమ్మఒడి రాలేదని, అందువల్ల బుక్‌లెట్‌ తీసుకోనని చెప్పారు. ఎవరని రామచంద్రారెడ్డి ఆరా తీయగా పక్కనున్నవారు తెదేపాకు చెందినవారని చెప్పడంతో ఆయన పరుష పదజాలంతో దూషించారని మారుతి మీడియాకు తెలిపారు. అలా మాట్లాడటం సరికాదని తాను అన్నానని, అనంతరం పోలీసులు స్టేషన్‌కు రావాలని కబురు పంపారని చెప్పారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్టేషన్‌లో ఉన్నానని, సాయంత్రం రమ్మనడంతో మళ్లీ 6 గంటలకు వెళ్లానని పేర్కొన్నారు. సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధితో మాట్లాడే తీరు సరిగాలేదని కౌన్సిలర్‌ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని