ఎస్సీ వర్గీకరణ ఓటు బ్యాంక్‌ కుట్ర

ఎస్సీ వర్గీకరణ అంశం రాజకీయ పార్టీల ఓటు బ్యాంక్‌ కుట్ర అని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఛైర్మన్‌ చెన్నయ్య విమర్శించారు. దిల్లీ జంతర్‌ మంతర్‌లో ఆదివారం నిర్వహించిన

Published : 08 Aug 2022 04:53 IST

వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఛైర్మన్‌ చెన్నయ్య

ఈనాడు, దిల్లీ: ఎస్సీ వర్గీకరణ అంశం రాజకీయ పార్టీల ఓటు బ్యాంక్‌ కుట్ర అని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఛైర్మన్‌ చెన్నయ్య విమర్శించారు. దిల్లీ జంతర్‌ మంతర్‌లో ఆదివారం నిర్వహించిన మహాధర్నాలో చెన్నయ్య మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణను దేశంలోని సుమారు 28 కోట్ల దళితులు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లు తమకు తెలిసిందని, ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ మాలమహానాడు, అంబేడ్కర్‌ యువజన సంఘాలు కలిసి ‘ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి’గా ఏర్పడినట్లు వివరించారు. ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు గతంలోనే కొట్టివేసిన నేపథ్యంలో.. కేంద్రం ఈ ప్రక్రియకు పూనుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని