జగన్‌ వేధింపులకు నిరసనగా 17న సమావేశం: డూండీ రాకేష్‌

సెబ్‌ అధికారులు నాటు సారా మాఫియాను వదిలేసి బెల్లం వ్యాపారుల్ని వేధిస్తున్నారని తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్‌ మండిపడ్డారు. అధికారికంగా

Published : 13 Aug 2022 05:11 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి : సెబ్‌ అధికారులు నాటు సారా మాఫియాను వదిలేసి బెల్లం వ్యాపారుల్ని వేధిస్తున్నారని తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్‌ మండిపడ్డారు. అధికారికంగా పన్నుల భారం మోపి.. అనధికారికంగా వైకాపా వాళ్లు జేట్యాక్స్‌లు వసూలు చేస్తున్నారని విమర్శించారు. వ్యాపారులపై వైకాపా ప్రభుత్వ వేధింపులకు నిరసనగా ఈ నెల 17న విజయవాడలో తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌  ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని