వ్యక్తిగత విమర్శలతో మునుగోడుకు నష్టం

మునుగోడులో సమస్యలపై చర్చ జరగాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఉప ఎన్నికపై కాకుండా వ్యక్తిగత విమర్శలపై దృష్టి మళ్లుతుండటంతో నియోజకవర్గ ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుందంటూ ఆదివారం ఆయన ఓ ప్రకటనలో ఆందోళన

Published : 15 Aug 2022 05:39 IST

 పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

భాజపా రూ.5 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: మునుగోడులో సమస్యలపై చర్చ జరగాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఉప ఎన్నికపై కాకుండా వ్యక్తిగత విమర్శలపై దృష్టి మళ్లుతుండటంతో నియోజకవర్గ ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుందంటూ ఆదివారం ఆయన ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, సమస్యలు చర్చకు రాకుండా చేసేందుకు భాజపా, తెరాసలు వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యమిస్తున్నాయని ఆక్షేపించారు. మునుగోడులో పెండింగ్‌లో ఉన్న ఎస్‌ఎల్‌బీసీ, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టులు, పోడు భూములు, ఇతర సమస్యల పరిష్కారం కోసం భాజపా రూ.5 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించి ఓట్లు అడగాలని డిమాండ్‌ చేశారు. రెండు పడకగదుల ఇళ్లు, దళితులకు మూడెకరాల సాగుభూమి, ఇంటికో ఉద్యోగం తదితర ఎన్నికల హామీలను కేసీఆర్‌ సర్కార్‌ గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. వామపక్ష పార్టీలు, తెజసలను కలుపుకొని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడతామని ఆయన స్పష్టం చేశారు.

* రేవంత్‌రెడ్డికి కరోనా నిర్ధారణ అయింది. శనివారం స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలినట్టు ట్విటర్‌లో ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.

* స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు రేవంత్‌రెడ్డి ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని