రాయచూర్‌పై కేసీఆర్‌ వ్యాఖ్యలు సరికాదు

తెరాస ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు చూసి, పొరుగునున్న రాయచూరు జిల్లావాసులు తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన

Published : 19 Aug 2022 05:15 IST

కర్ణాటక మంత్రి శంకర్‌ బి.పాటిల్‌

బెంగళూరు: తెరాస ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు చూసి, పొరుగునున్న రాయచూరు జిల్లావాసులు తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రేరేపితమని కర్ణాటక జౌళిశాఖ మంత్రి శంకర్‌ బి.పాటిల్‌ విమర్శించారు. బుధవారం పార్టీ సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘యాద్గిర్‌, రాయచూర్‌లను మేము ప్రాధాన్య జిల్లాలుగా గుర్తించి అభివృద్ధికి బోలెడు నిధులు కేటాయిస్తున్నాం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్‌ ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారు. ఇంతకుమించి దీనిపై స్పందించడానికి ఏమీలేదు’ అని గురువారం పాటిల్‌ వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని