డిక్లరేషన్‌పై సంతకం పెట్టిన తర్వాతే స్వామి వారి దర్శనానికి వెళ్లాలి

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్న ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి డిక్లరేషన్‌పై సంతకం పెట్టిన తర్వాతే స్వామి వారి దర్శనానికి వెళ్లాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనందసూర్య డిమాండ్‌ చేశారు.

Published : 27 Sep 2022 04:57 IST

తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనందసూర్య

ఈనాడు, అమరావతి: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్న ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి డిక్లరేషన్‌పై సంతకం పెట్టిన తర్వాతే స్వామి వారి దర్శనానికి వెళ్లాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనందసూర్య డిమాండ్‌ చేశారు. ‘‘జగన్‌రెడ్డికి హిందూ ధర్మంపైనా, తిరుమల పవిత్రతపైనా ఏమాత్రం నమ్మకం ఉన్నా డిక్లరేషన్‌ ఇవ్వాలి. గతంలో ఎంతో మంది ప్రముఖులు డిక్లరేషన్‌ ఇచ్చిన తర్వాతే స్వామి వారిని దర్శించుకున్నారు. జగన్‌ రెడ్డి డిక్లరేషన్‌ ఇవ్వడానికి నిరాకరించడం తీవ్ర అభ్యంతరకరం. అదే సమయంలో హైందవ సంప్రదాయం ప్రకారం సనాతన పూజా క్రతువులో పాల్గొన్నపుడు ధర్మపత్నితో కలిసి వెళ్లడం ఆనవాయితీ. గత మూడున్నర సంవత్సరాలుగా జగన్‌రెడ్డి ఒక్కసారి కూడా తన భార్యతో కలిసి దైవదర్శనానికి వెళ్లిన దాఖలాలు లేవు. ఇది ముమ్మాటికీ హైందవ ధర్మాన్ని ఉల్లంఘించడమే. పవిత్ర దుర్గా నవరాత్రుల సందర్భంగా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమానికి డిక్లరేషన్‌ ఇవ్వకుండా వెళ్లడం హిందూ ధర్మాన్ని అవమానించడమే...’’ అని ఆయన సోమవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని