YS Sharmila: వైఎస్సార్‌కు కాంగ్రెస్‌ వెన్నుపోటు పొడిచింది: షర్మిల

పార్టీకి 30 ఏళ్లపాటు సుదీర్ఘంగా సేవలందించిన విషయాన్ని కూడా మరిచిపోయి వైఎస్సార్‌కు కాంగ్రెస్‌ వెన్నుపోటు పొడిచిందని వైతెపా రాష్ట్ర అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల మండిపడ్డారు. వైఎస్సార్‌ చనిపోయిన తర్వాత ఆయన దోషి అని కాంగ్రెస్‌

Updated : 30 Sep 2022 09:19 IST

హత్నూర, న్యూస్‌టుడే: పార్టీకి 30 ఏళ్లపాటు సుదీర్ఘంగా సేవలందించిన విషయాన్ని కూడా మరిచిపోయి వైఎస్సార్‌కు కాంగ్రెస్‌ వెన్నుపోటు పొడిచిందని వైతెపా రాష్ట్ర అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల మండిపడ్డారు. వైఎస్సార్‌ చనిపోయిన తర్వాత ఆయన దోషి అని కాంగ్రెస్‌ పార్టీ ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయించి మోసం చేసిందన్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్‌, హత్నూరలో గురువారం నిర్వహించిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఆమె ప్రసంగించారు. కనీసం హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోతే ఎలా చనిపోయాడు అని దర్యాప్తు కూడా చేయించలేదని ఆరోపించారు. ఇక తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం రాజకీయంగా, ఆర్థికంగా బలపడిందన్నారు. కనీసం అయిదో తరగతి, ఆరో తరగతి కూడా చదవని వారు ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతుంటే.. ఉన్నత చదువులు చదివిన వారు మాత్రం రోడ్ల మీద తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన ఎనిమిదేళ్ల పాలనలో ఎవరికీ న్యాయం చేయలేదని విమర్శించారు. ఉద్యోగులకు సక్రమంగా జీతాలు ఇవ్వడంలేదని, రాష్ట్రంలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని