భూ నిర్వాసితులను మోసగించిన కేసీఆర్‌

నల్గొండ జిల్లా చర్లగూడెం ప్రాజెక్టు ముంపు గ్రామాల బాధితులకు మార్కెట్‌ ధరకు అయిదు రెట్ల పరిహారం, భూమికి భూమి, ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎకరాకు కేవలం రూ.4.15 లక్షలిచ్చి మోసం చేశారని బహుజన్‌ సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు.

Published : 02 Oct 2022 04:55 IST

ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌

నాంపల్లి (మర్రిగూడ), న్యూస్‌టుడే: నల్గొండ జిల్లా చర్లగూడెం ప్రాజెక్టు ముంపు గ్రామాల బాధితులకు మార్కెట్‌ ధరకు అయిదు రెట్ల పరిహారం, భూమికి భూమి, ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎకరాకు కేవలం రూ.4.15 లక్షలిచ్చి మోసం చేశారని బహుజన్‌ సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా శనివారం నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం చర్లగూడెం ముంపు గ్రామాల్లో ఆయన పర్యటించారు. మండలకేంద్రంలో భూ నిర్వాసితుల నిరసన దీక్షలో పాల్గొని మాట్లాడారు. చర్లగూడెం రైతులకిచ్చిన హామీలు నెరవేర్చకుండా భూములు స్వాధీనం చేసుకోవడంతో అన్నదాతలు అడ్డా కూలీలుగా మారారని, మనస్తాపంతో 50 మంది ప్రాణాలు వదిలారని ఆరోపించారు.  రాజగోపాల్‌రెడ్డికీ తెరాస కాంట్రాక్టులు దక్కాయని, పేదలను మోసం చేసేందుకు దొరలంతా ఒక్కటవుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బహుజనులు ఆధిపత్య పార్టీలకు గుణపాఠం చెప్పాలన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts