Ayyannapatrudu: తెదేపా హయాంలో జగన్‌ బంధువులకూ రుణమాఫీ: అయ్యన్నపాత్రుడు

తెదేపా హయాంలో జగన్‌ బంధువులకూ రుణమాఫీ అయ్యిందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంతో పోల్చడం మీ తరం కాదని ఆదివారం ట్విటర్‌లో మండిపడ్డారు.

Updated : 03 Oct 2022 07:00 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా హయాంలో జగన్‌ బంధువులకూ రుణమాఫీ అయ్యిందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంతో పోల్చడం మీ తరం కాదని ఆదివారం ట్విటర్‌లో మండిపడ్డారు. తమ పాలనలో తెదేపా వారికీ సంక్షేమ పథకాల లబ్ధి అంందిందని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేయడంతో దానికి సమాధానంగా అయ్యన్నపాత్రుడు ట్వీట్‌ చేశారు. ‘వైఎస్‌ మదన్మోహన్‌రెడ్డికి, జగన్‌రెడ్డి వదిన వైఎస్‌ మాధవీలతకు తెదేపా హయాంలో రైతు రుణమాఫీ నగదు పడింది. వైఎస్‌ మధు అకౌంట్‌ నం: 045213100036589లో రెండు విడతలుగా రూ.63వేలు, మూడో విడత రూ.36వేలు, మాధవీలత అకౌంట్‌ నం. 045213100036613లో రెండు విడతలుగా రూ.59,643, మూడో విడతగా రూ.34,081 జమయ్యాయి. వీటిని మర్చిపోతే ఎలా?’ అని అయ్యన్నపాత్రుడు ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని