వైకాపాను మళ్లీ గెలిపిస్తే రాష్ట్రాన్ని తాకట్టుపెడతారు: విష్ణువర్ధన్‌రెడ్డి

‘వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తే ఏపీని పొరుగు రాష్ట్రానికి తాకట్టు పెట్టడం ఖాయం. కాగ్‌ నివేదిక, రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలకు పొంతన లేదు.

Published : 08 Oct 2022 04:17 IST

అనంతపురం అరవిందనగర్‌, న్యూస్‌టుడే: ‘వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తే ఏపీని పొరుగు రాష్ట్రానికి తాకట్టు పెట్టడం ఖాయం. కాగ్‌ నివేదిక, రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలకు పొంతన లేదు. ఆర్థిక లావాదేవీలపై గోప్యం ఎందుకు? దొంగలెక్కలు ఎందుకు చూపుతారు? రాష్ట్రానికి నిధులివ్వాలంటేనే కేంద్రం సందేహించే పరిస్థితి ఎందుకు వచ్చిందో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు చెప్పాలి...’ అని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఇక్కడ శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటే ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు తీరని ద్రోహం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏ ముఖం పెట్టుకుని ఏపీలో అడుగుపెడతారని విష్ణువర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. దేశంలో కేఏ పాల్‌ పార్టీకి, కేసీఆర్‌ పార్టీకి తేడా లేదు. ‘ఎందరో మహనీయుల విగ్రహాలను తొలగించిన ఘనత మీది.. ముందుగా ఆ కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి...’ అని విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని