Satyakumar: తథాస్తు దేవతలు ఉంటారు.. జాగ్రత్త జగన్‌: సత్యకుమార్

తథాస్తు దేవతలు ఉంటారు! జాగ్రత్త జగన్‌ గారూ! తొందరెందుకు అని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు.

Updated : 19 Oct 2022 10:53 IST

ఈనాడు, అమరావతి: తథాస్తు దేవతలు ఉంటారు! జాగ్రత్త జగన్‌ గారూ! తొందరెందుకు అని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. ‘నంద్యాలలో ఉత్తుత్తి బటన్లు నొక్కారు. పచ్చి అబద్ధాలు చెప్పారు. గుండ్రేవుల, సిద్దేశ్వరం, వేదవతి, పందికోన ప్రాజెక్టులు కూడా ‘మన ప్రభుత్వం’ పూర్తి చేసేసినట్లు చెప్పేసి ఉంటే కేఏ పాల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లభించేది’ అని ఎద్దేవాచేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీలు కూలిపోవాలని సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై సత్యకుమార్‌ ఈ ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని