Prashant Kishor: ఆరుగురు సీఎంలు నాకు డబ్బులిస్తున్నారు: పీకే

బిహార్‌లో ప్రత్యామ్నాయ రాజకీయవ్యవస్థ నెలకొల్పడమే ధ్యేయంగా చేపట్టిన ‘జన్‌ సురాజ్‌’ ఉద్యమానికి తన మాజీ క్లయింట్లు ఆర్థికసాయం చేస్తున్నారని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) వెల్లడించారు.

Updated : 27 Oct 2022 07:37 IST

బిహార్‌లో ప్రత్యామ్నాయ రాజకీయవ్యవస్థ నెలకొల్పడమే ధ్యేయంగా చేపట్టిన ‘జన్‌ సురాజ్‌’ ఉద్యమానికి తన మాజీ క్లయింట్లు ఆర్థికసాయం చేస్తున్నారని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) వెల్లడించారు. రాజకీయ సలహాదారుగా పనిచేసేందుకు తాను స్థాపించిన ‘ఐప్యాక్‌’ నుంచి గతంలో సేవలు పొందినవారు ఇప్పుడు అండగా ఉంటున్నారని సంకేతాలిచ్చారు. వారిలో ఆరుగురు ప్రస్తుతం ముఖ్యమంత్రులుగా ఉన్నట్లు తెలిపారు. బిహార్‌లో 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్న ప్రశాంత్‌ కిశోర్‌ నేపాల్‌ సరిహద్దుల్లోని వాల్మీకినగర్‌లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. పీకేకు భాజపా ఆర్థిక వనరులు సమకూరుస్తూ ఉండొచ్చని జేడీయూ అధ్యక్షుడు రాజీవ్‌ రంజన్‌సింగ్‌ అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ‘జన్‌ సురాజ్‌’ అధినేత స్వయంగా దీనిపై స్పష్టత ఇచ్చారు.

- ఈటీవీ భారత్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని