‘అనర్హత పిటిషన్‌’లో తప్పుడు ఆరోపణలు: రాజాసింగ్‌

తన ఎన్నికను సవాల్‌ చేస్తూ ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌ దాఖలు చేసిన పిటిషన్‌లోని అభియోగాలు తప్పుడువని ఆరోపిస్తూ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సుప్రీంకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు.

Published : 28 Nov 2022 04:17 IST

ఈనాడు, దిల్లీ: తన ఎన్నికను సవాల్‌ చేస్తూ ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌ దాఖలు చేసిన పిటిషన్‌లోని అభియోగాలు తప్పుడువని ఆరోపిస్తూ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సుప్రీంకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. రాజాసింగ్‌ తనపై ఉన్న క్రిమినల్‌ కేసులను 2018 శాసనసభ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనలేదని, ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ తెరాస తరఫున పోటీ చేసి ఓడిపోయిన ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాజాసింగ్‌ను కోర్టు ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని