అమరరాజా తరలిపోవడంపై సీఎం జగన్‌ ప్రజలకు సమాధానం చెప్పాలి

రాష్ట్రంలో పరిశమ్రలు పెడతామని వచ్చిన వారికి పూర్తి స్థాయిలో సహకారం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఉన్న సంస్థలు తరలిపోయేలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరికాదని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి పేర్కొన్నారు.

Published : 04 Dec 2022 04:46 IST

లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి

సీతంపేట, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పరిశమ్రలు పెడతామని వచ్చిన వారికి పూర్తి స్థాయిలో సహకారం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఉన్న సంస్థలు తరలిపోయేలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరికాదని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి పేర్కొన్నారు. అమరరాజా బ్యాటరీ పరిశ్రమ రాష్ట్రం నుంచి తరలిపోవడంపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి లాంటి వ్యక్తికి పరిశ్రమలు కాపాడుకోవాలన్న యోచన లేకపోవడం దురదృష్టకరం. ఆయన అనుచరులు పరిశ్రమల యజమానులను అవహేళన చేయడంతో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. రూ.9,500 కోట్లతో పెట్టుబడి పెట్టే పరిశ్రమ తెలంగాణకు తరలిపోతే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? అమరరాజా వంటి పరిశ్రమలు రావాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆహ్వానిస్తే మన రాష్ట్రం వదులుకోవడాన్ని తప్పుబట్టారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే...’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని