తెలంగాణను అప్పులకుప్పగా మార్చారు: తెదేపా

రాష్ట్రం ఏర్పడినప్పుడు సంపన్నంగా ఉన్న తెలంగాణను తెరాస ప్రభుత్వం అప్పులకుప్పగా మార్చిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ విమర్శించారు.

Published : 05 Dec 2022 04:47 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రం ఏర్పడినప్పుడు సంపన్నంగా ఉన్న తెలంగాణను తెరాస ప్రభుత్వం అప్పులకుప్పగా మార్చిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ విమర్శించారు. తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాస్‌తో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన పలువురు బీసీ సంఘాల నేతలు ఆదివారం ఎన్టీఆర్‌ భవన్‌లో తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్‌ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబునాయుడు తలసరి ఆదాయాన్ని పెంచితే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ తలసరి అప్పు పెంచారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని