సీమకు అసలైన ద్రోహి వైకాపానే

‘మూడున్నరేళ్లలో రాయలసీమలో ఒక్క సాగునీటి ప్రాజెక్టూ కట్టలేదు. ఒక్క పరిశ్రమా తేలేదు. ఎన్టీఆర్‌ ప్రారంభించిన తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా పథకాలను చంద్రబాబునాయుడు, రాజశేఖర్‌రెడ్డి కొనసాగిస్తే.. జగన్‌ వచ్చాక ఒక్క అడుగూ ముందుకు పడలేదు.

Published : 06 Dec 2022 06:26 IST

తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: ‘మూడున్నరేళ్లలో రాయలసీమలో ఒక్క సాగునీటి ప్రాజెక్టూ కట్టలేదు. ఒక్క పరిశ్రమా తేలేదు. ఎన్టీఆర్‌ ప్రారంభించిన తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా పథకాలను చంద్రబాబునాయుడు, రాజశేఖర్‌రెడ్డి కొనసాగిస్తే.. జగన్‌ వచ్చాక ఒక్క అడుగూ ముందుకు పడలేదు. అమరరాజా బ్యాటరీస్‌ ప్రభుత్వ కక్ష సాధింపుతో కొత్త ప్లాంటును తెలంగాణకు తరలిస్తోంది. వైకాపానే సీమకు అసలైన ద్రోహి’ అని తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. అనంతపురంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘కర్నూలులో హైకోర్టుకు కేంద్రం కాదంటే.. దిల్లీలో గర్జించాలి. హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలకు విరుద్ధంగా ప్రాజెక్టులు కడుతున్న తెలంగాణ ప్రభుత్వంపై గర్జించాలి. ప్రభుత్వ ప్రతిష్ఠ పల్చనయిపోతున్న తరుణంలో కర్నూలులో గర్జన పేరిట సెంటిమెంట్‌ రగిలించడం సరికాద’ని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని