ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఆడపడుచుల ఆత్మగౌరవ సభలు

ఆడపడుచుల ఆత్మగౌరవం కోసం డిసెంబరు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో గౌరవ సభలు నిర్వహించాలని తెదేపా పొలిట్‌ బ్యూరో నిర్ణయించింది. శాసనసభను కౌరవ

Published : 27 Nov 2021 03:52 IST

డిసెంబరు 1 నుంచి ప్రారంభం

తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశంలో తీర్మానం

ఈనాడు, అమరావతి: ఆడపడుచుల ఆత్మగౌరవం కోసం డిసెంబరు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో గౌరవ సభలు నిర్వహించాలని తెదేపా పొలిట్‌ బ్యూరో నిర్ణయించింది. శాసనసభను కౌరవ సభగా మార్చి మహిళల వ్యక్తిత్వంపై ఏ విధంగా దాడి చేశారో ప్రజాచైతన్యం కల్పించాలని పేర్కొంది. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన పొలిట్‌ బ్యూరో శుక్రవారం సమావేశమైంది. వరద మరణాలపై జ్యుడీషియల్‌ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసింది. తుపాను ముందస్తు చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని, వరద తీవ్రతకు ఇసుక మాఫియా చర్యలూ కారణంగా ఉన్నాయని పేర్కొంది.  వరద మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష పరిహారంగా ఇవ్వాలని, అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని