యూపీ భాజపా సీఎం అభ్యర్థి యోగి

ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో భాజపా తదుపరి సీఎం అభ్యర్థి కూడా యోగి ఆదిత్యనాథ్‌ అని తేలిపోయింది. ఈ మేరకు ఆదివారం వర్చువల్‌గా నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు స్పష్టత ఇచ్చాయి.

Published : 07 Feb 2022 04:35 IST

స్పష్టంచేసిన ప్రధాని మోదీ

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో భాజపా తదుపరి సీఎం అభ్యర్థి కూడా యోగి ఆదిత్యనాథ్‌ అని తేలిపోయింది. ఈ మేరకు ఆదివారం వర్చువల్‌గా నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు స్పష్టత ఇచ్చాయి. రాష్ట్రంలో యోగి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తించారని మోదీ కొనియాడారు. కేంద్రం తోడ్పాటుతో రాష్ట్రంలో అమలయ్యే ఇళ్ల నిర్మాణం, ఉజ్వల్‌ వంటి పథకాలు గత రెండేళ్లుగా కరోనా కారణంగా నెమ్మదించాయని, యోగి మళ్లీ సీఎం అయ్యాక వాటిని రెట్టింపు వేగంతో పూర్తిచేస్తారన్నారు. ‘‘భాజపాను గెలిపించాలి.. యోగిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలి’’ అంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగిపై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉండటంతో.. భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిని మారుస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు మోదీ వ్యాఖ్యలతో పార్టీ నిర్ణయంపై స్పష్టత వచ్చింది.

సమాజ్‌వాదీపై ధ్వజం
మథుర, ఆగ్రా, బులంద్‌శహర్‌ ఓటర్లను ఉద్దేశించి మోదీ చేసిన ప్రసంగంలో సమాజ్‌వాదీ పార్టీపై, ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌పై విరుచుకుపడ్డారు. సమాజ్‌వాదీ కుటుంబ పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు. డబ్బు, కండబలం, కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు చేసేవారు యూపీ ప్రజల ప్రేమను పొందలేరని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని