కక్షపూరిత రాజకీయాలు సరికాదు

ప్రజాస్వామ్య దేశంలో కక్షపూరిత రాజకీయాలు తగవని కేంద్ర ఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అన్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డ భాజపా నాయకుడు సాయిగణేశ్‌ కుటుంబసభ్యులను బుధవారం ఆయన

Published : 21 Apr 2022 05:33 IST

కేంద్ర సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌

ఈటీవీ, ఖమ్మం: ప్రజాస్వామ్య దేశంలో కక్షపూరిత రాజకీయాలు తగవని కేంద్ర ఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అన్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డ భాజపా నాయకుడు సాయిగణేశ్‌ కుటుంబసభ్యులను బుధవారం ఆయన పరామర్శించారు. మృతుడి అమ్మమ్మ సావిత్రి, సోదరి కావేరిలకు ధైర్యం చెప్పారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సాయిగణేశ్‌ ఆత్మహత్య ఘటనపై పూర్తి దర్యాప్తు జరిపి.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అంతకుముందు బాధిత కుటుంబాన్ని హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

భాజపా శ్రేణుల నిరసన ఉద్రిక్తం

సాయిగణేశ్‌ ఆత్మహత్యకు బాధ్యులైన వారిని గుర్తించి, చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ భాజపా శ్రేణులు బుధవారం ఖమ్మంలో చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. జడ్పీ సెంటర్‌లో ప్రదర్శన చేపట్టగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. భాజపా కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని వ్యాన్‌లు ఎక్కించి ఒకటో పట్టణ ఠాణాకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని