కేసీఆర్‌తో తమిళ నటుడు విజయ్‌ భేటీ

తమిళ సినీ నటుడు విజయ్‌ బుధవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ భేటీలో సీఎం ఆయనను పోచంపల్లి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయస్థాయి రాజకీయ వేదిక యత్నాల గురించి  విజయ్‌ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. తెలంగాణ అభివృద్ధి తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పినట్లు తెలిసింది. సీఎం మాట్లాడుతూ సామాజిక సమస్యలను కథాంశంగా తీసుకొని నిర్మించే

Published : 19 May 2022 05:03 IST

జాతీయ స్థాయి రాజకీయ వేదిక గురించి ఆరా!

ఈనాడు, హైదరాబాద్‌: తమిళ సినీ నటుడు విజయ్‌ బుధవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ భేటీలో సీఎం ఆయనను పోచంపల్లి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయస్థాయి రాజకీయ వేదిక యత్నాల గురించి  విజయ్‌ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. తెలంగాణ అభివృద్ధి తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పినట్లు తెలిసింది. సీఎం మాట్లాడుతూ సామాజిక సమస్యలను కథాంశంగా తీసుకొని నిర్మించే చిత్రాల్లో నటిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారని అభినందించారని పార్టీ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా ప్రజల్లోపాలన స్ఫూర్తి తెచ్చేందుకే తాను జాతీయ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం యత్నిస్తున్నానని సీఎం వివరించినట్లు సమాచారం.

* ఇస్టా అధ్యక్షునిగా ఎన్నికైన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులును సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని