Harish Rao: నాలుగు నెలల పాలనలో నానా తిప్పలు పెట్టారు: హరీశ్‌రావు

కాంగ్రెస్‌ హామీలు నమ్మి ప్రజలు ఓట్లేసి మోసపోయారని తెలంగాణ మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకొస్తామని చెప్పి..మడమ తిప్పారని విమర్శించారు.

Updated : 05 Apr 2024 14:28 IST

మెదక్‌: కాంగ్రెస్‌ హామీలు నమ్మి ప్రజలు ఓట్లేసి మోసపోయారని భారాస నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకొస్తామని మడమ తిప్పారని విమర్శించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశారా? అని ప్రశ్నించారు. మెదక్‌ నియోజకవర్గ భారాస కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘రుణమాఫీ డబ్బులు రాలేదని.. బ్యాంకు అధికారులు రైతుల ఇళ్లపై పడ్డారు. రూ. 2 లక్షల రుణమాఫీ జరిగిన వాళ్లు కాంగ్రెస్‌కు ఓటేయండి. రుణమాఫీ కాకపోతే భారాసకు ఓటు వేయండి. వరి పండిస్తే రూ.500 బోనస్‌ ఇస్తామన్నారు.. ఇచ్చారా? వడ్లపై దృష్టిపెట్టమంటే.. రేవంత్‌రెడ్డి వలసలపై దృష్టి పెట్టారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారు.. చేయలేదు. నాలుగు నెలల కాంగ్రెస్‌ పాలనలో నానా తిప్పలు పెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధిచెప్పాలి’’ అని హరీశ్‌రావు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని