KA PAUL: గద్దర్‌ను భయపెట్టారు.. దీంతో అభ్యర్థిగా నేనే నామినేషన్ వేశా: కేఏ పాల్

తమ పార్టీ అభ్యర్థిగా గద్దర్‌ నామినేషన్‌ వేయకుండా అధికార పార్టీ నాయకులు భయబ్రాంతులకు గురిచేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఆరోపించారు.

Updated : 15 Oct 2022 09:37 IST

చండూరు, న్యూస్‌టుడే: తమ పార్టీ అభ్యర్థిగా గద్దర్‌ నామినేషన్‌ వేయకుండా అధికార పార్టీ నాయకులు భయబ్రాంతులకు గురిచేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఆరోపించారు. నామినేషన్‌ వేయకున్నా తన పాట ద్వారా మద్దతు ఉంటుందని ఆయన తమకు హామీ ఇచ్చారని వెల్లడించారు. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్‌ వేసిన అనంతరం కేఏ పాల్‌ చండూరులో విలేకరులతో మాట్లాడారు. నామినేషన్‌ వేసేందుకు ఇక్కడికి రాకుండా తనకు అధికారులు అడ్డంకులు సృష్టించారని, అయినా వచ్చినట్లు తెలిపారు. పాలకుల నిర్లక్ష్యంతో ఈ నియోజకవర్గం వెనుకబాటుకు గురైందని, ఇక్కడి ప్రజలు తనను గెలిపిస్తే మునుగోడును ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా ఏకం కావాలని పాల్‌ పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు