Karnataka Elections: కాంగ్రెస్‌ నేతలారా.. ప్రజల మనసులు గెలుచుకోండి: కపిల్‌ సిబల్‌

కర్ణాటక ఎన్నికల్లో (Karnataka Elections) విజయం సాధించిన కాంగ్రెస్‌ నేతలు ఐదేళ్లపాటు ప్రజల మనసులు గెలుచుకోవాలని ఆ పార్టీ మాజీ నేత కపిల్‌ సిబల్‌ ఆకాంక్షించారు.

Published : 14 May 2023 21:16 IST

దిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly elections) కాంగ్రెస్‌ అఖండ విజయం సాధించడంపై రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్‌ మాజీ నేత కపిల్‌ సిబల్‌ (kapil Sibal) స్పందించారు. రానున్న ఐదేళ్లపాటు కాంగ్రెస్‌ (Congress) పార్టీ నిజాయితీగా పని చేసి, ఎలాంటి వివక్ష చూపకుండా ప్రజల మనసులు గెలుచుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘ఎన్నికల్లో విజయం సాధించడం కష్టం. ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడం ఇంకా కష్టం. అందుకే రానున్న ఐదేళ్లపాటు నిజాయితీగా, వివక్ష లేకుండా పాలన సాగించండి. భాజపా ఇలా చేయలేకపోవడం వల్లే పరాజయం పాలైంది’’ అని కపిల్‌ సిబల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

మొత్తం 224 స్థానాలకు గానూ కాంగ్రెస్‌ 135 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నప్పుడు కూడా కపిల్‌ సిబల్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘ ప్రధాని ఓడిపోయారు.. కర్ణాటక ప్రజలు విజయం సాధించారు. 40శాతం కమీషన్‌కు, కేరళ స్టోరీకి, విభజన రాజకీయాలకు, అహంకారానికి కన్నడ ప్రజలు ‘నో’ చెప్పారు.’’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. యూపీఏ 1, యూపీఏ 2 హయాంలో కపిల్‌ సిబల్‌ కేంద్ర మంత్రిగా పని చేశారు. గతేడాది మేలో కాంగ్రెస్‌ను వీడి..సమాజ్‌వాదీ పార్టీ మద్దతులో స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని