Kishan Reddy: కవిత అరెస్టుతో భాజపాకు సంబంధం లేదు: కిషన్‌రెడ్డి

ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో భాజపాకు సంబంధం లేదని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Updated : 17 Mar 2024 15:34 IST

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో భాజపాకు సంబంధం లేదని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. భారాస నేత, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ భాజపాలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత పీఏలు, బినామీలు అప్రూవర్‌గా మారి మద్యం కుంభకోణం కేసులో వివరాలు ఇస్తున్నారని చెప్పారు. ‘‘అవినీతిపరులు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదు. కోర్టు తీర్పునకు కట్టుబడి ఉంటామని కవిత చెప్పాలి. బినామీలతో మద్యం వ్యాపారాలు మీరు చేసి మాపై విమర్శలా? ఈడీ స్వతంత్ర సంస్థ.. దానికి అధికారాలు ఉంటాయి. హైదరాబాద్‌లో అసదుద్దీన్‌ ఒవైసీపై గెలుస్తాం. కాంగ్రెస్‌ హామీలు ఫ్లెక్సీల వరకే అమలవుతున్నాయి.’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని