Amethi: అమేఠీ నుంచే పోటీ చేయండి.. రాహుల్‌కు స్మృతి ఇరానీ సవాల్‌!

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేవలం అమేఠీ స్థానం నుంచే పోటీ చేయాలని రాహుల్‌ గాంధీకి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సవాల్‌ విసిరారు.

Published : 20 Feb 2024 01:59 IST

అమేఠీ: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ (Amethi) నుంచి మరోసారి పోటీకి దిగాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీ స్మృతి ఇరానీ (Smriti Irani) సవాల్‌ విసిరారు. ఆయన ఆధ్వర్యంలోని ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ అమేఠీకి చేరుకున్న వేళ స్మృతి ఈ మేరకు మాట్లాడారు. నిర్మానుష్య వీధులు ఆయనకు స్వాగతం పలికాయంటూ ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రి సైతం ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. ఒకే సమయంలో ఈ ఇద్దరు నేతలు స్థానికంగా పర్యటిస్తుండటం ఐదేళ్లలో ఇది రెండోసారి.

ఆ ఆఫర్‌కు ఓకే చెప్తే రాహుల్‌ వెంటే.. కాంగ్రెస్‌కు అఖిలేశ్‌ కండీషన్

‘‘2019లో ఈ ప్రాంతాన్ని రాహుల్‌ విడిచిపెట్టారు. ఈరోజు ఆయన్ను అమేఠీ వదిలేసింది. ఒకవేళ ఆయనకు ఆత్మవిశ్వాసం ఉంటే కేవలం ఈ ఒక్క స్థానం నుంచే పోటీ చేయాలి’’ అని విలేకరులతో ఇరానీ మాట్లాడారు. ఇదిలా ఉండగా.. రాహుల్‌ గాంధీ గతంలో అమేఠీ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా 15 ఏళ్లపాటు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఓటమిపాలయ్యారు. మరోవైపు న్యాయ్‌ యాత్రలో భాగంగా ‘కులగణన’ ఆవశ్యకతను రాహుల్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని