Manik Saha: త్రిపుర సీఎంగా రెండోసారి.. ప్రధాని సమక్షంలో మాణిక్ సాహా ప్రమాణం
భాజపా(BJP) పెద్దల సమక్షంలో త్రిపుర కొత్త ముఖ్యమంత్రి మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం చేశారు. రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
అగర్తల: త్రిపుర(Tripura) ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా(Manik Saha) ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన భాజపా.. ముఖ్యమంత్రిగా మరోసారి సాహానే ఎంపిక చేసింది. దాంతో ఆయన రెండోసారి సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హాజరయ్యారు. అలాగే ఈశాన్య రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీలో భాజపా(BJP) 32 సీట్లు కైవసం చేసుకొని అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మిత్రపక్షం ఐపీఎఫ్‌టీ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొదట్లో ముఖ్యమంత్రి పదవికి సాహాతో పాటు కేంద్రమంత్రి ప్రతిమా భౌమిక్ పేరు కూడా వినిపించింది. అయితే నూతనంగా ఎన్నికయిన ఎమ్మెల్యేల సమావేశంలో సాహాకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. బిప్లవ్ దేబ్ స్థానంలో సాహా గతేడాది మార్చి 14న త్రిపుర సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
పసిపాప ఆకలి తీర్చేందుకు.. 10 కిలోమీటర్ల ప్రయాణం!
-
Crime News
vizag: విశాఖ రామజోగయ్యపేటలో కూలిన మూడు అంతస్తుల భవనం.. చిన్నారి మృతి
-
India News
కొంగ మీది బెంగతో.. యువరైతు కంటతడి
-
Sports News
హ్యాట్రిక్ డక్.. తొలి బంతికే.. వరుసగా విఫలమవుతున్న సూర్యకుమార్
-
World News
Prince Harry: ప్రిన్స్ హ్యారీకి అమెరికా ‘బహిష్కరణ’ ముప్పు..!
-
India News
Amritpal Singh: అరెస్టైనవారికి సాయం చేస్తాం: అకాలీదళ్