DMK: డీఎంకే చీఫ్‌గా రెండోసారి స్టాలిన్‌..!

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ రెండో సారి డీఎంకే అధినేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఉదయం చెన్నైలో పార్టీ జనరల్‌ కౌన్సిల్‌ మీటింగ్‌ జరిగింది.

Published : 09 Oct 2022 13:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ రెండో సారి డీఎంకే అధినేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఉదయం చెన్నైలో పార్టీ జనరల్‌ కౌన్సిల్‌ మీటింగ్‌ జరిగింది. ఇక పార్టీ సీనియర్‌ నేతలు దురైమురుగన్‌, టీఆర్‌ బాలు.. పార్టీ జనరల్‌ సెక్రటరీ, కోశాధికారులుగా ఎన్నికయ్యారు. వీరు ముగ్గురూ ఈ పదవులకు ఎంపిక కావడం వరుసగా ఇది రెండోసారి. ఇటీవలే పార్టీ కొత్త జనరల్‌ కౌన్సిల్‌ కూడా ఏర్పడింది. ఇటీవల 15వ సారి డీఎంకే పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగాయి. పార్టీలోని వివిధ విభాగాల్లో వీటిని నిర్వహించారు. 

దివంగత కరుణానిధి హయాంలో స్టాలిన్‌ పార్టీలో చాలా కీలక పదవులను చేపట్టారు. ఆయన గతంలో పార్టీ కోశాధికారి, యువజన విభాగం కార్యదర్శిగా పనిచేశారు. 2018లో తొలిసారి ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. డీఎంకే తొలిసారి పార్టీ అధ్యక్ష పదవిని ఏర్పాటు చేశాక 1969లో కరుణానిధి ఆ స్థానానికి ఎన్నికయ్యారు. అప్పటి వరకు పార్టీలో పార్టీ వ్యవస్థాపకుడు అన్నాదురై జనరల్‌ సెక్రటరీ పదవిలో ఉన్నారు. అప్పట్లో అదే పార్టీ అత్యున్నత పదవి. ఆయన మరణం తర్వాత కరుణానిధి  పార్టీ తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు