Jaggareddy: వచ్చే పదేళ్లలో సీఎం అవుతా: ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

విజయదశమి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డిలో నిర్వహించిన వేడుకల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Updated : 24 Oct 2023 13:43 IST

సంగారెడ్డి: విజయదశమి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డిలో నిర్వహించిన వేడుకల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పదేళ్లలో తాను తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతానని చెప్పారు. విజయదశమి నాడు నా మనసులో మాట చెబుతున్నానన్నారు. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి.. జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అని.. దీన్ని ఎవరైనా కాదనగలరా అని ఆయన ప్రశ్నించారు.

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో తన నోరు, చేతులు కట్టేశారని లేకపోతే మరిన్ని విషయాలను పంచుకునే వాడినని జగ్గారెడ్డి అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తినని చెప్పారు. నియోజకవర్గంలో తాను అందుబాటులో లేక పోయినా తన భార్యతో పాటు అనుచరులు ఉంటారన్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా వెంటనే అక్కడికి వాలిపోతానని చెప్పారు. ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ తనపై ఉండాలని ఆయన కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని