రేవంత్ చిన్నపిల్లవాడు: కోమటిరెడ్డి
తాను కాంగ్రెస్‌లోనే ఉంటాననని.. పార్టీ మారే ఆలోచన లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. తన దృష్టిలో పీసీసీ అధ్యక్ష పదవి చాలా చిన్నదని చెప్పారు. దిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు..
దిల్లీ: తాను కాంగ్రెస్‌లోనే ఉంటాననని.. పార్టీ మారే ఆలోచన లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. తన దృష్టిలో పీసీసీ అధ్యక్ష పదవి చాలా చిన్నదని చెప్పారు. దిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ను ముందుకు నడిపే సమర్థమైన నేత లేరు. రేవంత్ చిన్నపిల్లవాడు. ఆయన గురించి నా దగ్గర మాట్లాడొద్దు. రాజకీయాలపై మాట్లాడనని గతంలోనే చెప్పా. నేతలు రాజకీయాలు వదిలేసి అభివృద్ధిపై దృష్టి సారించాలి. ప్రజాసమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడతా’’ అని కోమటిరెడ్డి అన్నారు.
కిషన్‌రెడ్డితో భేటీ
అంతకుముందు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కోమటిరెడ్డి ఆయన్ను కలిసి అభినందనలు తెలిపారు. భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా కిషన్‌రెడ్డిని కోరారు. తెలంగాణ వారసత్వ సంపదగా ఉన్న భువనగిరి ఖిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తరఫున నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కోమటిరెడ్డి వినతిపత్రం అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్
తన గెలుపు కోసం యువజన కాంగ్రెస్ సంపూర్ణ సహకారం అందించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కోరారు. -
నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్‌రేట్‌ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం