Andhra News: నిధులు తెచ్చుకోలేని దుస్థితిలో సీఎం జగన్: నిమ్మల రామానాయుడు

శాసనసభ వేదికగా పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పచ్చి అబద్ధాలు చెప్పారని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు నిమ్మల రామానాయుడు అన్నారు. తనపై ఉన్న కేసుల

Updated : 22 Mar 2022 20:15 IST

అమరావతి: శాసనసభ వేదికగా పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పచ్చి అబద్ధాలు చెప్పారని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు నిమ్మల రామానాయుడు అన్నారు. తనపై ఉన్న కేసుల భయంతోనే సీఎం పోలవరాన్ని, ప్రత్యేక హోదాను గాలికి వదిలేశారని విమర్శించారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా, పోలవరం సాధిస్తానని ఎందుకు ప్రగల్భాలు పలికారని నిలదీశారు. తెదేపా హయాంలో కేంద్రం ఆమోదించిన రూ.55,548 కోట్ల ప్రాజెక్టు అంచనాలను ఆమోదింపజేసుకొని, నిధులు తెచ్చుకోలేని దుస్థితిలో జగన్ రెడ్డి ఉన్నారన్నారు. తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి నెపాన్ని తెదేపా అధినేత చంద్రబాబుపైకి తోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలవరం ఎత్తుతగ్గించే ఆలోచన లేదంటున్న సీఎం.. గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. పోలవరం విషయంలో ముఖ్యమంత్రి ఆడుతున్న నాటకాలు రాష్ట్ర రైతాంగానికి శాపంగా మారనున్నాయని రామానాయుడు విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని