Uttar pradesh: లుంగీ ధరించిన వారంతా నేరస్థులా?: కాంగ్రెస్‌

ఉత్తరప్రదేశ్‌లో వచ్చే  ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు వ్యూహాత్మక ప్రచారాలు.. ప్రసంగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ వ్యాఖ్యలు వివాదాలకు దారితీస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, భాజపా నేత కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రయాగ్‌రాజ్‌లో

Published : 05 Dec 2021 18:00 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు వ్యూహాత్మక ప్రచారాలు.. ప్రసంగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని వ్యాఖ్యలు వివాదాలకు దారితీస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, భాజపా నేత కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రయాగ్‌రాజ్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన.. లుంగీ, టోపీ ధరించిన వ్యక్తులు గతంలో శాంతిభద్రతలకు సవాలుగా మారేవారని అన్నారు. 2017కు ముందు లుంగీలు ధరించిన వ్యక్తులు వ్యాపారుల్ని తుపాకులతో బెదిరించేవారని, స్థలాలు కబ్జా చేసేవారని వ్యాఖ్యానించారు. భాజపా ప్రభుత్వం వచ్చాక అలాంటి నేరస్థులు కనిపించట్లేదన్నారు. మౌర్య వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రషీద్‌ అల్వీ మాట్లాడుతూ.. ‘యూపీలో ఉండే హిందువుల్లో సగం మంది లుంగీ ధరిస్తారు. మౌర్య వ్యాఖ్యల ప్రకారం లుంగీ ధరించిన వారంతా నేరస్థులేనా?’’అని ప్రశ్నించారు. భాజపా కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకొని రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ప్రజలు భాజపా వ్యవహరిస్తున్న తీరును అర్థం చేసుకున్నారని, అది తెలిసి అధికార పార్టీ భయపడుతోందని రషీద్‌ చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని