Revanth Reddy: అభ్యర్థుల ఎంపికలో అపోహలకు గురి కావొద్దు: ఆశావహులకు రేవంత్‌ విజ్ఞప్తి

ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ(పీఈసీ) ఎంపిక చేసిన జాబితాను.. సీల్డ్‌ కవర్‌లో స్క్రీనింగ్‌ కమిటీకి అందజేస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు.

Published : 03 Sep 2023 19:46 IST

హైదరాబాద్‌: ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ(పీఈసీ) ఎంపిక చేసిన జాబితాను.. సీల్డ్‌ కవర్‌లో స్క్రీనింగ్‌ కమిటీకి అందజేస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. 3 రోజుల పాటు స్క్రీనింగ్‌ కమిటీ హైదరాబాద్‌లోనే ఉంటుందన్నారు. సోమవారం పీఈసీ సభ్యులతో వేర్వేరుగా స్క్రీనింగ్‌ కమిటీ సమావేశమై అభిప్రాయాలు తెలుసుకుంటుందన్నారు. మంగళవారం డీసీసీ అధ్యక్షులు, సీనియర్‌ నాయకులతో కమిటీ సమావేశమవుతుందన్నారు. ఈనెల 6న స్క్రీనింగ్‌ కమిటీ ప్రత్యేకంగా సమావేశమై పీఈసీ ఇచ్చిన నివేదికపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుందన్నారు.

స్క్రీనింగ్‌ కమిటీ తయారు చేసిన జాబితా.. సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీకి నివేదిస్తుందన్నారు. వీలైనంత తర్వలో మొదటి జాబితా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు.
కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించే జాబితానే ఫైనల్‌ అని.. అప్పటి వరకు పీసీసీ అధ్యక్షుడిగా తనకు కూడా సమాచారం ఉండదన్నారు. ‘‘ అభ్యర్థుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. ఈసారి అభ్యర్థుల్లో బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేయబోతున్నాం. స్థానిక పరిస్థితులు, సామాజిక వర్గాలు ఆధారం చేసుకుని బీసీ అభ్యర్థులను ఎంపిక చేస్తాం. అభ్యర్థుల ఎంపికలో ఎవరూ ఎలాంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదు’’ అని రేవంత్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు