Revanth reddy: రూ.30వేల కోట్ల సంపదను కారుచౌకగా కట్టబెట్టారు: రేవంత్‌ రెడ్డి

సుమారు రూ.30 వేల కోట్ల ఆదాయం వచ్చే ఓఆర్‌ఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం కారుచౌకగా ముంబయి కంపెనీకి కట్టబెట్టిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Updated : 29 Apr 2023 18:28 IST

హైదరాబాద్‌: భాగ్యనగరానికి మణిహారంలా ఉన్న ఔటర్‌ రింగ్‌ రోడ్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అమ్మకానికి పెట్టిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలతో కలిసి గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

సుమారు రూ.30వేల కోట్ల ఆదాయం వచ్చే ఔటర్ రింగ్‌ రోడ్డును రూ.7, 380 కోట్లకు కారుచౌకగా ముంబయి కంపెనీకి కట్ట్టబెట్టారని రేవంత్‌ మండిపడ్డారు. దేశంలోనే ఇది అత్యంత పెద్ద కుంభకోణమని ఆరోపించారు. ఇందులో రూ.1,000 కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించబోదని.. అధికారంలోకి వచ్చాక దీనిపై సమగ్ర విచారణకు ఆదేశిస్తామన్నారు. యాజమాన్యం కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నట్లు ఆయన తెలిపారు. సోమేష్‌కుమార్, అరవింద్‌కుమార్, జయేష్‌ రంజన్ నిర్ణయాలన్నింటిపై కాంగ్రెస్‌ పార్టీ సమీక్షిస్తుందన్నారు. వీటిపై భాజపా ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ఆస్తులను కేసీఆర్ అమ్ముతుంటే బండి సంజయ్‌, కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడంలేదని రేవంత్‌ నిలదీశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని