Smriti Irani: అక్కడ హగ్గింగ్.. ఇక్కడ బెగ్గింగ్‌: విపక్ష పార్టీలపై స్మృతి వ్యంగ్యాస్త్రాలు

కాంగ్రెస్‌-లెఫ్ట్ పార్టీలు దిల్లీలో నిర్వహించే సమావేశాల్లో పాల్గొంటాయని, కేరళలో మాత్రం పోట్లాడుకుంటాయని భాజపా నాయకురాలు స్మృతి ఇరానీ (Smriti Irani) విమర్శించారు. 

Published : 06 Apr 2024 19:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విపక్ష ‘ఇండియా’ కూటమి పార్టీలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) వ్యంగ్యాస్త్రాలు విసిరారు.  కేరళలోని వయనాడ్‌ (Wayanad)లో కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై సీపీఐ తన అభ్యర్థిని నిలబెట్టడాన్ని ప్రశ్నిస్తూ విమర్శలు చేశారు.

‘‘విపక్షాల పరిస్థితి ఎలా ఉందంటే.. అవి వయనాడ్‌ (Wayanad)లో పోట్లాడుకుంటున్నాయి. రాహుల్‌గాంధీ ఉత్తర్‌ ప్రదేశ్‌ (అమేఠీ)కి ఎందుకు వెళ్లడం లేదని లెఫ్ట్‌ పార్టీలు అడుగుతున్నాయి. మళ్లీ అవే పార్టీలు  దిల్లీ వెళ్లి ఇండియా కూటమి సమావేశాల్లో పాల్గొంటాయి. ఇక్కడ విమర్శించిన నేతలు.. అక్కడ రాహుల్‌ను ఆలింగనం చేసుకుంటాయి’’ అని ఇరానీ ఎద్దేవా చేశారు.

లెఫ్ట్‌, కాంగ్రెస్‌ ఇండియా కూటమి పార్టీలు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆయా రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాల కోసం సీట్ల సర్దుబాటు జరుగుతున్న సమయంలోనే.. సీపీఐ తన పార్టీ ప్రముఖ నేత డి.రాజా సతీమణి ఆన్నీ రాజాను వయనాడ్‌  (Wayanad) నుంచి బరిలోకి దింపడం చర్చనీయాంశమైంది. రాహుల్‌ 2019లో తొలిసారిగా ఆ స్థానం (Wayanad) నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ కంచుకోట అమేఠీ నుంచి బరిలోకి దిగినప్పటికీ ఇరానీ చేతిలో ఓటమి చవిచూశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని